దర్గాలో మాజీ ఎంపీ కవిత ప్రార్థనలు

ABN , First Publish Date - 2020-10-12T09:45:12+05:30 IST

దర్గాలో మాజీ ఎంపీ కవిత ప్రార్థనలు

దర్గాలో మాజీ ఎంపీ కవిత ప్రార్థనలు

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఇక్కడ నాంపల్లిలోని యూసుఫియన్‌ దర్గాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేయడంతోపాటు చాదర్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఆమెకు ఆశీస్సులు అందించారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక ఫలితాలు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో కవిత దర్గా సందర్శనకు వచ్చారు. ఉప ఎన్నికలో ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. దర్గా సందర్శన కోసం వచ్చిన కవితకు హోం మంత్రి మహమూద్‌అలీ, హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ బాబాఫసీయుద్దీన్‌, స్థానిక కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2020-10-12T09:45:12+05:30 IST