నేరెడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు

ABN , First Publish Date - 2020-12-10T07:15:06+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరెడ్‌మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి 668 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నేరెడ్‌మెట్‌ డివిజన్‌ కౌటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

నేరెడ్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు

668 ఓట్ల తేడాతో బీజేపీపై విజయం

హైకోర్టు ఆదేశాలతో 544 ఓట్ల లెక్కింపు


నేరేడ్‌మెట్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరెడ్‌మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి 668 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నేరెడ్‌మెట్‌ డివిజన్‌ కౌటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్యాలట్‌ పేపర్‌పై స్వస్తిక్‌ గుర్తు కాకుండా వేరే గుర్తు ఉన్న కారణంగా లెక్కించకుండా పక్కన పెట్టిన 544 ఓట్లను కోర్టు ఆదేశాల మేరకు బుధవారం లెక్కించారు. డివిజన్‌ పరిధిలోని డిఫెన్స్‌ కాలనీలోని భవన్స్‌ విద్యాలయంలో లెక్కింపు జరిగింది. ఈ ఓట్లను లెక్కించిన అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డికి బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు కన్నా 668 ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపొందారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లీనా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మొత్తం 10,330 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 9,662 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 3,437 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 728 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 93 ఓట్లు వచ్చాయి. విజయం సాధించిన మీనా.. రిటర్నింగ్‌ అధికారి నుంచి గెలుపు పత్రాన్ని అందుకొన్నారు.

Updated Date - 2020-12-10T07:15:06+05:30 IST