కృష్ణా నదీజలాల వివాదాన్ని పరిష్కరించాలి: సురేశ్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-09-16T09:16:49+05:30 IST
ఏపీ, తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాల మధ్య నెలకొన్న కృష్ణా నదీజలాల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని ..

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాల మధ్య నెలకొన్న కృష్ణా నదీజలాల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం జరిగిన జీరో అవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నదీ జలాల కోసమే ఉద్యమం చేసి తాము రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని పేర్కొన్నారు.