సీఎం కేసీఆర్ ఉత్కంఠతకు తెర దింపుతారా?

ABN , First Publish Date - 2020-03-12T20:37:24+05:30 IST

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయమే నామినేషన్

సీఎం కేసీఆర్ ఉత్కంఠతకు తెర దింపుతారా?

హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయమే నామినేషన్ దాఖలు చేసే రోజైనప్పటికీ కూడా ఇప్పటి వరకూ అభ్యర్థులెవరనేది సీఎం కేసీఆర్ నిర్ణయించకపోవడంతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అయితే పార్టీ సీనియర్ నేత, సెక్రెటరీ జనరల్ అయిన కె.కేశవరావు అభ్యర్థిత్వాన్ని రెన్యువల్ చేస్తారా? అన్న సస్పెన్స్ మాత్రం వీడడం లేదు.


ఈసారి కూడా కేకెను రాజ్యసభకు అధినేత కేసీఆర్ పంపుతారని ఓ వర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. దీనిని బలపరుస్తూ గురువారం సీఎం కేసీఆర్ కేకేను వెంటబెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. దీంతో కేకే అభ్యర్థిత్వం దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులను ఖరారు చేయడానికి కేకేను వెంటబెట్టుకొని సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని భావిస్తున్నారు. మరోవైపు రెండు సెట్ల నామినేషన్ల పత్రాలపై టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి సంతకాలు సేకరించారు. 

Updated Date - 2020-03-12T20:37:24+05:30 IST