రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలవాలి: కేసీఆర్
ABN , First Publish Date - 2020-10-03T23:22:30+05:30 IST
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అంత ఈజీగా తీసుకోవద్దని హెచ్చరించారు.
హైదరాబాద్: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అంత ఈజీగా తీసుకోవద్దని హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరు జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు నమోదులో ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. 2014 తర్వాత డిగ్రీ పూర్తయిన యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని, ఉద్యోగులు, యువత టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే.. విమర్శకుల నోళ్లు మూయించాలని చెప్పారు. ధరణి వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్కరూ ఆస్తులు అధికారులకు తెలిపేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కేసీఆర్ పేర్కొన్నారు.