మదర్స్ డే సందర్భంగా ఎంపీ సంతోష్ ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2020-05-10T18:21:41+05:30 IST

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీ సంతోశ్ కుమార్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో

మదర్స్ డే సందర్భంగా ఎంపీ సంతోష్ ఆసక్తికర ట్వీట్

హైదరాబాద్: అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీ సంతోశ్ కుమార్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో తల్లిని, పెద్దమ్మ (సీఎం కేసీఆర్ సతీమణి) ను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.


నా కోసం ఎన్నో చేశారు..

‘‘నా జీవితంలో ఇద్దరు మహిళలకు అతుల్యమైన గౌరవాన్ని ఇస్తుంటాను. ఒకరు నాకు జన్మనిచ్చిన అమ్మ కాగా మరొకరు జీవితమంటే అర్థం నేర్పినవారు (పెద్దమ్మ). అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకు, పెద్దమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వారిద్దరూ నాకోసం ఎన్నో చేశారు. అందుకు ధన్యవాదాలు. మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ సంతోశ్ ట్వీట్ చేశారు.


అయితే ట్వీట్‌లో రెండు ఫోటోలను జత చేశారు. ఒకటి వాళ్ల అమ్మతో ఉన్న ఫోటో కాగా... రెండోది పెద్దమ్మ (కేసీఆర్ సతీమణి) తో ఉన్న ఫోటో. అయితే ఇంతటి ఆసక్తికర ట్వీట్‌ను టీఆర్‌ఎస్ శ్రేణులు షేర్ చేసుకుంటున్నారు. 

Updated Date - 2020-05-10T18:21:41+05:30 IST