ఎంపీ ల్యాడ్స్‌పై పునరాలోచన చేయండి: నామా
ABN , First Publish Date - 2020-09-16T09:16:06+05:30 IST
కరోనా నేపథ్యంలో రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన ఎంపీల్యాడ్స్ నిధులపై పునరాలోచించాలని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు సూచించారు.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):కరోనా నేపథ్యంలో రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన ఎంపీల్యాడ్స్ నిధులపై పునరాలోచించాలని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు సూచించారు. కరోనా వల్ల ఎంపీల జీతభత్యాలు, మాజీ ఎంపీల పెన్షన్లు తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఎంపీల జీతభత్యాలు, పెన్షన్ల చట్ట సవరణ బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎంపీల్యాడ్స్ నిధులను ఆస్పత్రులు, అంబులెన్సులు, ఇతర వైద్య అవసరాలకు వినియోగించాలని తాము ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. వైద్య సదుపాయాలకు నిధులు ఖర్చు చేయడానికైనా అనుమతించాలని ఆయన కోరారు.