ధర్మపురి అరవింద్ నా కొడుకులాంటి వాడు: ఎంపీ కేకే

ABN , First Publish Date - 2020-09-22T03:51:06+05:30 IST

వ్యవసాయ బిల్లు తప్పుగా ఆమోదం పొందిందని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్‌ చేశారని..

ధర్మపురి అరవింద్ నా కొడుకులాంటి వాడు: ఎంపీ కేకే

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లు తప్పుగా ఆమోదం పొందిందని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్‌ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సస్పెండ్ అయిన ఎంపీలకు టీఆర్‌ఎస్‌ సంఘీభావం ప్రకటించిందన్నారు. సస్పెన్షన్‌పై ఓటింగ్ కోరితే చైర్మన్ తిరస్కరించారని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నామని చెప్పారు. ధర్మపురి అరవింద్ తన కొడుకులాంటి వాడని.. ఆయన కామెంట్స్‌పై స్పందించనని ఎంపీ కేకే అన్నారు. 

Updated Date - 2020-09-22T03:51:06+05:30 IST