సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వైఖరి

ABN , First Publish Date - 2020-09-17T08:21:43+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు విమర్శించారు. దేశంలో నెలకొన్న కొవిడ్‌-19 పరిస్థితిపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వైఖరి

  • రాజ్యసభలో  టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు

న్యూఢిల్లీ, సెప్టెంబరు16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు విమర్శించారు. దేశంలో నెలకొన్న  కొవిడ్‌-19 పరిస్థితిపై  రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కరోనాను కట్టడి చేసే విషయంలో  కేంద్రం  రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వసనీయతలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం ఏకపక్షంగా లాక్‌డౌన్‌ ప్రకటించిందని, ఆ తర్వాత మూడురోజులకు ప్రధాని ముఖ్యమంత్రులతో మాట్లాడారని, ఇది ఎంతవరకు సబబని  ప్రశ్నించారు. రాష్ర్టాలకు ఇవ్వవలసిన జీఎస్టీ బకాయిలు రూ.8 వేల కోట్లు కేంద్రం నేటికీ ఇవ్వడంలేద ని తెలిపారు. కాగా, ఆయుర్వేద వైద్యంలో విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కేశవరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆయుర్వేదంలో బోధన, పరిశోధనకు సంబంధించిన బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు.  

Updated Date - 2020-09-17T08:21:43+05:30 IST