డబ్బా కొట్టుకోవడంతో సరిపోతోంది: ఎమ్మెల్యే సీతక్క
ABN , First Publish Date - 2020-09-14T20:49:47+05:30 IST
టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడకుండా తమ గొంతులు నొక్కితే ఏం వస్తుందని ప్రశ్నించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడకుండా తమ గొంతులు నొక్కితే ఏం వస్తుందని ప్రశ్నించారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్, స్వల్ప కాలిక చర్చ లేనే లేదని, ఆహో.. ఓహో అంటూ డబ్బా కొట్టుకోవడంతో సరిపోతుందని విమర్శించారు. అంతా బాగుంటే ఈ సభ ఎందుకు.. బాగా లేకపోతేనే కదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ముందు ఆత్మాహుతికి పాల్పడ్డ తెలంగాణ నాగులు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన పేరే తెలంగాణ నాగులు.. బండ్లగూడలో ఇంటికి వెళ్లినప్పుడు.. ఆయన మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కప్పారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు కనీసం నివాళులు అర్పించకపోవడం బాధాకరమన్నారు. 60 రోజుల లాక్ డౌన్ సమయంలో కరోనా ప్రభావం అనేక రంగాలపై పడిందని, ప్రభుత్వం వారందరినీ ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు.