బీజేపీ విజయం తాత్కాలికమే: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-10T14:40:07+05:30 IST

తెలంగాణలో కొన్న దుష్టశక్తులు ప్రయోగాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పూర్ణం సతీష్‌కుమార్ వ్యాఖ్యానించారు.

బీజేపీ విజయం తాత్కాలికమే: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

తిరుమల: తెలంగాణలో కొన్న దుష్టశక్తులు ప్రయోగాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పూర్ణం సతీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మతతత్వ శక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని దుష్ట శక్తులు ఏకమైన టీఆర్ఎస్‌ను ఏం చేయలేరని స్పష్టం చేశారు. బీజేపీ విజయం తాత్కాలికమే అని ఎమ్మెల్యే పూర్ణం సతీష్‌కుమార్ అన్నారు. 

Updated Date - 2020-12-10T14:40:07+05:30 IST