తెలంగాణలో కరోనా టెస్ట్‌లపై టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ
ABN , First Publish Date - 2020-06-23T17:31:34+05:30 IST
తెలంగాణలో కరోనా టెస్ట్‌లపై టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా టెస్ట్‌లపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణపై జేపీ నడ్డా తప్పుడు ప్రచారం మానుకోవాలని టీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. అవగాహన లేకుండా బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్ట్ మిషన్‌ను కోల్‌కతాకు తరలించారని ఆరోపించారు. బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయని కోల్‌కతాకు టెస్ట్ మిషన్‌ను తరలించారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.