టీఆర్ఎస్ నేతపై దాడి...పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2020-03-02T13:18:35+05:30 IST
టీఆర్ఎస్ నేతపై దాడి...పరిస్థితి విషమం

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్, నర్సింహాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తలపై కర్రలతో దాడి చేయడంతో నర్సింహా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నార్సింగ్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.