టీఆర్‌ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది
ABN , First Publish Date - 2020-11-26T07:34:02+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్‌ను అధికార టీఆర్‌ఎస్ పార్టీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్, నవంబర్ 25(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్‌ను అధికార టీఆర్‌ఎస్ పార్టీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని పబ్లిక్ టాయిలెట్లు, మెట్రో పిల్లర్లు, ఆర్టీసీ బస్టా్‌పలలో నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లు, బిల్ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేశారని పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా వాటిని ఏర్పాటు చేయడం.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించింది.
యథేచ్ఛగా ఏర్పాటు చేసిన వాటన్నింటిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అలాగే, పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయసంఘం టీఆర్‌ఎస్ పార్టీకి బహిరంగ మద్దతు తెలుపుతూ తీర్మానం చేసిందని, ఉపాధ్యాయుల గుర్తింపు సంఘం అలా ప్రకటించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని పేర్కొంది. ఆ సంఘం గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కోరింది.