‘మీకే ఎందుకు టికెట్‌ ఇవ్వాలి’

ABN , First Publish Date - 2020-11-06T14:12:45+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున కార్పొరేటర్‌ టికెట్‌ ఆశిస్తున్న వారి నుంచి గురువారం పార్టీ పరిశీలకులు గట్టు రామచందర్‌రావు, ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌లు అభిప్రాయాలు స్వీకరించారు. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, సులేమాన్‌నగర్‌, శాస్త్రీపురం

‘మీకే ఎందుకు టికెట్‌ ఇవ్వాలి’

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున కార్పొరేటర్‌ టికెట్‌ ఆశిస్తున్న వారి నుంచి గురువారం పార్టీ పరిశీలకులు గట్టు రామచందర్‌రావు, ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌లు  అభిప్రాయాలు స్వీకరించారు. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌,  సులేమాన్‌నగర్‌, శాస్త్రీపురం డివిజన్లలో పోటీ చేయాలనుకుంటున్న వారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించి వారు ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు, ఏఏ కార్యక్రమాలు చేపట్టారు అనే వివరాలు సేకరించారు. అదే సమయంలో మీకు టికెట్‌ ఎందుకు ఇవ్వాలి.. ఇస్తే మీరేమి అభివృద్ధ్ది చేస్తారు, ఇప్పటి వరకు మీరు చేసిందేమిటి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే మైలార్‌దేవుపల్లి డివిజన్‌ నుంచి సీటు ఆశిస్తున్న వారిని పిలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-11-06T14:12:45+05:30 IST