అక్రమ సొమ్మును పంపిణీ చేస్తున్న టీఆర్‌ఎస్ : దాసోజు
ABN , First Publish Date - 2020-12-01T08:19:15+05:30 IST
టీఆర్‌ఎస్ నేతలు అడ్డంగా సంపాదించిన సొమ్మును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్ ఆరోపించారు
హైదరాబాద్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్ నేతలు అడ్డంగా సంపాదించిన సొమ్మును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్ ఆరోపించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు పంచూతూ దొరికిన వీడియోలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు చూపారు. ఎన్నికల సంఘం బానిసలా పనిచేస్తున్నదని, ఎంగిలి మెతుకులకు ఆశపడి పోలీసులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మూసారంబాగ్ డివిజన్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మలక్‌పేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మందాడి విజయసింహారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు బద్దం సురేందర్‌రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.