భూపాలపల్లిలో కాంగ్రెస్-టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-07-10T20:29:58+05:30 IST

జిల్లాలోని మలహర్ మండలం రుద్రారం గ్రామంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు

భూపాలపల్లిలో కాంగ్రెస్-టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మలహర్ మండలం రుద్రారం గ్రామంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ విస్మరించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మధును అడ్డుకోవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. గొడవను కంట్రోల్ చేశారు.

Updated Date - 2020-07-10T20:29:58+05:30 IST