ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్‌ఎస్ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-11-25T07:51:48+05:30 IST
ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీసులకు టీఆర్‌ఎస్ కార్యదర్శి టీ.మధుసూదన్ ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీసులకు టీఆర్‌ఎస్ కార్యదర్శి టీ.మధుసూదన్ ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్కు సమీపంలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఈ నెల 23న ఉద్దేశపూర్వంగానే అరవింద్ తొలగించారని దానిలో పేర్కొన్నారు.
ఇది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను అవమానించడమేనని తెలిపారు. ఇదే విషయాన్ని డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు తీసుకున్న అనుమతి పత్రాన్ని ఫిర్యాదుతో మధుసూదన్ జతచేశారు.