భారీ మెజారిటీతో గెలిచి రండి!

ABN , First Publish Date - 2020-10-08T09:28:38+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి రావాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వదించారు. ప్రజలు, పార్టీ అభ్యున్నతి కోసం

భారీ మెజారిటీతో గెలిచి రండి!

దుబ్బాక అభ్యర్థి సుజాతను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్‌

పార్టీ బీ ఫారం అందజేసిన టీఆర్‌ఎస్‌ అధినేత

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో గెలిచి వస్తా: సుజాత

నామినేషన్‌కు డబ్బులిచ్చిన చిన్న నిజాంపేట మహిళలు


హైదరాబాద్‌/దుబ్బాక, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి రావాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వదించారు. ప్రజలు, పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు.  అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన నేపథ్యంలో సుజాత బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ టికెట్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సుజాతకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్‌ పార్టీ బీ ఫారాన్ని అందజేశారు. ఆరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారంలో క్షేత్ర స్థాయికి వెళ్లి చెప్పాలని సూచించారు.


సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో దుబ్బాకలో గెలిచి వస్తానని సుజాత ధీమా వ్యక్తం చేశారు. ఆమె వెంట మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ తదితరులు ఉన్నారు. సుజాత బుధవారం ప్రచారం ప్రారంభించారు. దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామ మహిళా సంఘాలు ఆమెకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి ఎన్నికల నామినేషన్‌కు గాను రూ.10 వేలు అందజేశాయి.  

Updated Date - 2020-10-08T09:28:38+05:30 IST