శ్రీశైలంలో టీఆర్‌ఎస్ ప్రచార వాహన సంచారం
ABN , First Publish Date - 2020-12-28T09:35:57+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా టీఆర్‌ఎస్ ప్రచార వాహనం వచ్చింది. రాజకీయ పార్టీల వాహనాలు, ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు, ప్రచార రథాల వంటివి క్షేత్రంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. ఏపీ నుంచి వచ్చే వాహనాలను శిఖరం వద్ద

శ్రీశైలం, డిసెంబరు 27: శ్రీశైల క్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా టీఆర్‌ఎస్ ప్రచార వాహనం వచ్చింది. రాజకీయ పార్టీల వాహనాలు, ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు, ప్రచార రథాల వంటివి క్షేత్రంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. ఏపీ నుంచి వచ్చే వాహనాలను శిఖరం వద్ద, తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను లింగాల గట్టు టోల్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారు. అనుమతి లేని వాహనాలను తిప్పి పంపుతారు. కానీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా క్షేత్ర పరిధిలోకి టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార వాహనం రావడం కలకలం రేపింది. దేవస్థానం భద్రతా సిబ్బంది గమనించి ప్రచార వాహనాన్ని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.