టీఆర్‌ఎస్, బీజేపీ అధికారం కోసమే పనిచేస్తున్నాయి: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-12-15T23:32:14+05:30 IST
టీఆర్‌ఎస్, బీజేపీ అధికారం కోసమే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను లేకుండా చేయడానికి టీఆర్ఎస్
హైదరాబాద్: టీఆర్‌ఎస్, బీజేపీ అధికారం కోసమే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను లేకుండా చేయడానికి టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి అమిత్ షాను కలవడంలో ఆంతర్యమేంటి? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వెంటనే బీజేపీ నేత బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడానికి కారణం ఏంటి అని ఆయన నిలదీశారు. కేసీఆర్‌ను ఎప్పుడు జైల్లో పెడతారో సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఢిల్లీలో విందులు, గల్లీలో చిందులు వేస్తున్నాయని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో కేసీఆర్, బీజేపీ మధ్య రాజకీయ చీకటి ఒప్పందం చేసుకున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.