రెండో రోజు ట్రయల్ రన్ విజయవంతం
ABN , First Publish Date - 2020-05-13T08:39:44+05:30 IST
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ సర్జ్‌పూల్ నుంచి గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ సమీపంలోని అక్కారం పంపుహౌస్‌కు

- మల్లన్నసాగర్ సర్జ్‌పూల్ నుంచి గోదావరి జలాల పంపింగ్ ప్రారంభం
- మొదటి రోజు మొరాయించిన బాహుబలి మోటార్
- 24 గంటలు శ్రమించిన ఇంజనీర్లు
తొగుట, మే 12: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ సర్జ్‌పూల్ నుంచి గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ సమీపంలోని అక్కారం పంపుహౌస్‌కు తరలించే ప్రక్రియను అధికారులు మంగళవారం సాయంత్రంవిజయవంతంగా పూర్తి చేశారు. మొదటి రోజు ఒకటో నంబరు బాహుబలి మోటార్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఇంజనీర్లు 24 గంటల పాటు శ్రమించి నీటిని విడుదల చేశారు. మొదటి రోజు మోటార్ మొరాయించడంతో సీఎం వ్యక్తిగత, నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరేరాం, ఎస్‌ఈ ఆనంద్ అక్కడే ఉండి సాంకేతిక లోపాలను సరిచేసేలా చర్యలు తీసుకున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఇక్కడి నుంచి సుమారు 18 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ద్వారా బుధవారం తెల్లవారుజాము వరకు గోదావరి జలాలు అక్కారం పంప్‌హౌ్‌సలోకి చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి నీటిని పంపింగ్ చేసి కొండపోచమ్మ సాగర్‌కు తరలించనున్నారు. ఇంతకుముందే రంగనాయక సాగర్ నుంచి 16.5 కిలోమీటర్ల టన్నెల్, 3 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ద్వారా మల్లన్నసాగర్ సర్జ్‌పూల్‌కు 0.6 టీఎంసీల నీరు వచ్చి చేరిన విషయం తెలిసిందే.