ప్రభుత్వ విధానం గందరగోళంగా ఉంది: హైకోర్టు
ABN , First Publish Date - 2020-09-14T23:23:23+05:30 IST
డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్లు కోరారు
హైదరాబాద్: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలుకాదని ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందని పేర్కొంది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని, సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అటానమస్ కాలేజీలకు మాత్రమే ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అనుమతిచ్చినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తామని ఓయూ తెలిపింది. మరోవైపు ఆన్‌లైన్‌లో మిడ్‌టర్మ్, ఆఫ్‌లైన్‌లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్టీయూ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏదో ఒక విధానం ఉండాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది.