17వేల మెగావాట్ల డిమాండ్‌నూ తట్టుకుంటాం

ABN , First Publish Date - 2020-08-16T09:48:54+05:30 IST

రాష్ట్రంలో 17 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా తట్టుకోవడానికి వీలుగా సరఫరా వ్యవస్థను ...

17వేల మెగావాట్ల డిమాండ్‌నూ తట్టుకుంటాం

  • రూ.2500 కోట్లతో కాళేశ్వరం సరఫరా వ్యవస్థ పటిష్ఠం
  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 17 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా తట్టుకోవడానికి వీలుగా సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేశామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు శనివారం స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్ల రికార్డుస్థాయి డిమాం డ్‌ వచ్చిందని వెల్లడించారు. పంద్రాగస్టు సందర్భంగా విద్యుత్‌ సౌధలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో విద్యుదుత్పాదక సామర్థ్యం 7778 మెగావాట్లుగా ఉండగా.. ప్రస్తుతం 15,883 మెగావాట్లకు చేరుకున్నాం. మరో 11,715 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 పంపులకు విద్యుత్తు సరఫరా చేయడానికి వీలుగా రూ.2500 కోట్లతో సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేశాం. తెలంగాణ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎ్‌సఎల్‌డీసీ) పనితీరును కేంద్ర విద్యుత్‌ సంస్థ(సీఈఏ) కూడా ప్రశంసించింది’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు దేశానికే రోల్‌మోడల్‌గా ఉన్నాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు.


Updated Date - 2020-08-16T09:48:54+05:30 IST