సాధారణ రైళ్లలో కరెంట్‌ బుకింగ్‌కు అవకాశం

ABN , First Publish Date - 2020-05-24T08:01:34+05:30 IST

సాధారణ రైళ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ..

సాధారణ రైళ్లలో కరెంట్‌ బుకింగ్‌కు అవకాశం

  • బెర్తులు ఖాళీగా ఉంటేనే ఈ సదుపాయం

సికింద్రాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): సాధారణ రైళ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రయాణానికి ముందు మొదటి చార్టు తయారయ్యాక, రెండో చార్డు సిద్ధమయ్యేలోపే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. జూన్‌ 1 నుంచి నడవనున్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 15 జతల రైళ్లు నడవనున్న విషయం తెలిసిందే. ఈ రైళ్లు బయలుదేరడానికి 4 గంటల ముందు మొదటి చార్టు, 2 గంటల ముందు 2వ చార్టు సిద్ధమవుతాయి. సేవా కేంద్రాలు, పీఆర్‌సీ కౌంటర్లు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్లతోపాటు ఆన్‌లైన్‌లో ప్రయాణికులు టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 


30 రోజుల ముందే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చని, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ మాదిరిగానే రిజర్వేషన్‌ కోటాలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిబంధనల మేరకే ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్టు ఉంటాయని వివరించారు.  అయితే, అత్యవసర కోటా (ఈక్యూ) దరఖాస్తులను నేరుగా తీసుకోకూడదని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్‌ రైల్‌నిలయం ప్రవేశ/నిష్క్రమణ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్‌బాక్సుల్లోనే ఆ దరఖాస్తులను వేయాలని సూచించింది. 

‘పల్లె ప్రగతి’ వల్లే  గ్రామాలు సురక్షితం

Updated Date - 2020-05-24T08:01:34+05:30 IST