లాక్‌డౌన్ ఉన్నా ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2020-03-24T10:51:21+05:30 IST
‘‘నిత్యావసర సరకులు తీసుకువెళ్లేందుకు బైక్‌పై ఒకరిని, కార్లో ఇద్దరిని మాత్రమే అనుమతించండి. నిషేధాజ్ఞలు పాటించకుండా రోడ్లపైకి వచ్చే

హైదరాబాద్‌లో 4 వేల వాహనాలు సీజ్
హైదరాబాద్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘నిత్యావసర సరకులు తీసుకువెళ్లేందుకు బైక్‌పై ఒకరిని, కార్లో ఇద్దరిని మాత్రమే అనుమతించండి. నిషేధాజ్ఞలు పాటించకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయండి’’ లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలివి. కానీ సోమవారం క్షేత్రస్థాయిలో పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రధాన కూడళ్లలో బారికేడ్లు పెట్టిన పోలీసులు ఐదు నిమిషాల తర్వాత వదిలేశారు. దీంతో హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. హైవేలపై రావొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు కొన్ని చోట్ల వాహనదారులకు హితవు చెప్పడం గమనార్హం.
మధ్యాహ్నం సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేంత వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత ఆటోలు, బైక్‌లను సీజ్ చేశారు. సోమవారం మొత్తం 4 వేల వాహనాలను(1000 ఆటోలు, 3 వేల బైక్‌లు) సీజ్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ తెలిపారు.