వణికిస్తున్న చలి
ABN , First Publish Date - 2020-12-06T07:38:44+05:30 IST
రాష్ట్రంలో చలి రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోతుండడతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోతుండడతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నాలుగు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. శనివారం తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో 8.1, సిర్పూర్ (యూ)లో 9.1, వాంకిడిలో 9.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, ఆదిలాబాద్‌లో 10.2, మెదక్‌లో 12.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 14 డిగ్రీలు, హన్మకొండలో 14 డిగ్రీలు, హైదరాబాద్‌లో 14.5 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
చలికాలం
కేంద్రం కనిష్ఠం గరిష్ఠం
ఆదిలాబాద్ 10.2 30.8
వరంగల్ 14.0 30.0
నిజామాబాద్ 14.0 30.7
సంగారెడ్డి 14.0 29.0
రామగుండం 14.3 31.0
హైదరాబాద్ 14.5 30.4