పీఆర్సీని ప్రకటించాలి : టీపీయూఎస్‌

ABN , First Publish Date - 2020-12-31T03:50:55+05:30 IST

పీఆర్సీని ప్రకటించాలి : టీపీయూఎస్‌

పీఆర్సీని ప్రకటించాలి : టీపీయూఎస్‌
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టీపీయూఎస్‌ నేతలు

టేకుమట్ల, డిసెంబరు 30: పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం  (టీపీయూఎస్‌) జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే దశల వారీ ఆందోళనలకు సంబంధించి పోస్టర్‌ను భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధి రామక్రిష్టాపూర్‌(టి)లోని ఎమ్మార్సీ భవనంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ  టీపీయూసీ ఆధ్వర్యంలో జనవరి 4న మండల పా ఠశాల స్థాయిలో నల్లబ్యాడ్జీలతో నిరసన, 6న మండల కేం ద్రంలో ధర్నా, 8న డివిజన్‌ కేంద్రాల్లో బైక్‌ ర్యాలీ, 11న భూపాలపల్లిలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన మహేందర్‌, మండల అధ్యక్షు డు గంపల స్వామి, ప్రధాన కార్యదర్శి కుడికాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T03:50:55+05:30 IST