ప్రభుత్వ రంగాలపై నియంత్రణ లేదు: టీపీసీసీ

ABN , First Publish Date - 2020-09-16T09:19:58+05:30 IST

ప్రైవేటు విద్య, వైద్య రంగాలపై ఏ మాత్రం నియంత్రణ లేని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ రంగాలపైనా నియంత్రణ ..

ప్రభుత్వ రంగాలపై నియంత్రణ లేదు: టీపీసీసీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు విద్య, వైద్య రంగాలపై ఏ మాత్రం నియంత్రణ లేని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ రంగాలపైనా నియంత్రణ కోల్పోయిందని టీపీసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ కత్తి వెంకటస్వామి విమర్శించారు. లాక్‌డౌన్‌-4 నిబంధనల ప్రకారం ఈనెల 21 వరకు విద్యాసంస్థలు తెరవకూడదు. కానీ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు హాజరు కావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో వందలాదిమంది కరోనాబారిన పడ్డారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-16T09:19:58+05:30 IST