జిల్లా కేంద్రాల్లో టూరిజం హోటళ్లు: టీఎస్‌టీడీసీ
ABN , First Publish Date - 2020-12-29T08:37:00+05:30 IST
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో బడ్జెట్ హోటళ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎ్‌సటీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో బడ్జెట్ హోటళ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎ్‌సటీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ కేఎస్ శ్రీనివాసరాజు, సంస్థ ఎండీ మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. తక్కువ ధరల్లో వసతి గదులు, భోజన సదుపాయాలు లభించేలా కార్పొరేషన్ ఆధ్వర్యంలో బడ్జెట్ హోటళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని తెలిపారు.