ప్రేమించాలని యువకుడి వేధింపులు

ABN , First Publish Date - 2020-03-21T10:31:34+05:30 IST

ప్రేమించాలని వెంటపడుతున్న యువకుడి వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కఽథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం

ప్రేమించాలని యువకుడి వేధింపులు

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య 

నర్సాపూర్‌ రూరల్‌, మార్చి 20: ప్రేమించాలని వెంటపడుతున్న యువకుడి వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కఽథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన దండు మాధవి(17) నర్సాపూర్‌లో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతుంది. అదే గ్రామానికి చెందిన సార రవి కొంత కాలంగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. దీంతో పలుమార్లు అమ్మాయి తల్లిదండ్రులు అతడిని మందలించారు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని ఈ నెల 19న మాధవిని రవి బెదిరించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని శుక్రవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా, అప్పటికే మాధవి పూర్తిగా కాలిపోయింది.

Updated Date - 2020-03-21T10:31:34+05:30 IST