హైదరాబాద్‌కు టాలీవుడ్‌ సాయం

ABN , First Publish Date - 2020-10-21T09:39:50+05:30 IST

హైదరాబాద్‌ వరద బాధితులకు టాలీవుడ్‌ ప్రముఖులు అండగా నిలిచారు.

హైదరాబాద్‌కు టాలీవుడ్‌ సాయం

చిరంజీవి, మహేశ్‌, ప్రభాస్‌, పవన్‌ తలా ఓ కోటి 


హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ వరద బాధితులకు టాలీవుడ్‌ ప్రముఖులు అండగా నిలిచారు. సీఎం సహాయనిధికి చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోటి రూపాయల చొప్పున, అక్కినేని నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.50 లక్షల చొప్పున, రామ్‌ పోతినేని రూ.25 లక్షలు, రవితేజ, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ, విజయ్‌ దేవరకొండ, త్రివిక్రమ్‌, సూర్యదేవర రాధాకృష్ణ రూ.10 లక్షల చొప్పున, అనీల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌, బండ్ల గణేశ్‌ రూ.5 లక్షల చొప్పున విరాళం అందించారు. ‘‘వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ప్రాణ నష్టంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. నా వంతుగా రూ.కోటి ఇస్తున్నా. ఎవరికి వీలైనం త వారు సాయం చేయాలని కోరుతున్నా’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఈ విపత్తు ఊహించనిదని నాగార్జున, మహేశ్‌బాబు, జూ.ఎన్టీఆర్‌ చెప్పారు.

Updated Date - 2020-10-21T09:39:50+05:30 IST