చేనును పరిశీలించాకే టోకెన్లు

ABN , First Publish Date - 2020-10-28T07:11:03+05:30 IST

మొక్కజొన్న కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించేందుకు మార్క్‌ఫెడ్‌ సమాయత్తమవుతోంది. ఎవరుపడితే వారు మక్కలు తీసుకొస్తే కాంటా వేయొద్దని, వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించిన

చేనును పరిశీలించాకే టోకెన్లు

పకడ్బందీగా మొక్కజొన్న కొనుగోళ్లు 

మార్క్‌ఫెడ్‌ మార్గదర్శకాలు

నేటి నుంచి కొనుగోళ్లు

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించేందుకు మార్క్‌ఫెడ్‌ సమాయత్తమవుతోంది. ఎవరుపడితే వారు మక్కలు తీసుకొస్తే కాంటా వేయొద్దని, వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత, రైతులకు టోకెన్లు జారీచేసి.. ఆ తర్వాతే కొనుగోళ్లు చేయాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయించింది. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి, స్టేట్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ మార్గదర్శకాలు రూపొందించి అన్ని జిల్లాల మేనేజర్లకు మంగళవారం పంపించారు.


కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఏక్యూ(ఫేర్‌ యావరేజ్‌ క్వాలిటీ) మార్గదర్శకాలు తయారు చేశారు. 14 శాతం వరకు తేమ ఉంటే పరవాలేదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఒక్కో శాతం చొప్పున మద్దతు ధర(రూ.1,800)లో కోత పెడతారు. ఇతర వ్యర్థ పదార్థాలు ఒక శాతం, ఇతర పంటల గింజలు 2 శాతం, దెబ్బతిన్న/పుచ్చిపోయిన గింజలు 1.5 శాతం, పాక్షికంగా దెబ్బతిని రంగుమారితే 4.5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యానికి 3 శాతం, పురుగులు పడితే 1 శాతం వరకు మినహాయింపులు ఇచ్చారు.


ఇంతకంటే ఎక్కువ దాటితే మద్దతు ధర(రూ.1,850)లో కోత పడుతుంది. కాగా, మక్కల కొనుగోలు కేంద్రాల ఎంపిక, పర్యవేక్షణ బాధ్యతలు ‘డీఎల్‌పీసీ’(జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ)కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎ్‌సలు, డీసీఎంఎ్‌సలు, ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు చేయాలని, మక్కల లభ్యతకు అనుగుణంగా సెంటర్లు పెంచుకోవచ్చని జిల్లా కమిటీలకు సూచించారు.

వ్యవసాయ క్లస్టర్‌కు బాధ్యులుగా ఉన్న ఏఈవోలు.. వీఆర్‌ఏ, ఇతర గ్రామస్థాయి అధికారులను తీసుకొని, మొక్కజొన్న సాగుచేసిన క్షేత్రాన్ని పరిశీలించాలని, రైతు పేరు, సాగు విస్తీర్ణం ధ్రువీకరించుకున్న తర్వాతే ‘టోకెన్లు’ జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. క్షేత్రంలో ఉన్న పంటను చూసి, దిగుబడిని అంచనావేసి, అందుకు తగినట్లుగా పరిమాణాన్ని టోకెన్లలో ప్రస్తావించాలని.. అంతకుమించి ఒక్క క్వింటా కూడా ఎక్కువ కొనుగోలు చేయటానికి వీలులేకుండా మార్గదర్శకాలు ఇచ్చారు.


Updated Date - 2020-10-28T07:11:03+05:30 IST