అమ్మవారి మొక్కు కోసం కల్లు కుండను ఎలా దించారంటే...

ABN , First Publish Date - 2020-06-18T20:16:00+05:30 IST

చెట్టు నుంచి కల్లు కుండను కిందికి దించడం.... అంటే అదో విద్య అంటారు. దానికి అవసరమైన

అమ్మవారి మొక్కు కోసం కల్లు కుండను ఎలా దించారంటే...

జగిత్యాల : చెట్టు నుంచి కల్లు కుండను కిందికి దించడం.... అంటే అదో విద్య అంటారు. దానికి అవసరమైన పరికరాలను వాడుతూ... చెట్టెక్కినా సరే... చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే... జగిత్యాల జిల్లా వెల్గటూరులోని గుల్లకోట గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఓ ఆనవాయితీ నడుస్తోంది. అక్కడి రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవానికి మొక్కు కోసం తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తారు.


ఎప్పటి లాగా మోకు, ముత్తాదుతోనే చెట్టుపైకి ఎక్కుతారు. అయితే కల్లు కుండను కిందికి దించే సమయంలో మాత్రం ఆ కుండ మోకు, ముత్తాదుకు ఏమాత్రం అంటనీయరు. ఇలా అంటకూడదు కాబట్టి... ఓ 20 మంది మనుషులు చెట్టుపైకి ఎక్కి.. ఒక్కొక్కరు తమ చేతుల గుండా ఆ కల్లు కుండను కిందికి దించారు. సంప్రదాయాన్ని దృఢ సంకల్పంతో నెరవేర్చారు. 


Updated Date - 2020-06-18T20:16:00+05:30 IST