కల్లుకు వెసులుబాటు కల్పించాలి: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-04-12T09:30:00+05:30 IST
లాక్‌డౌన్ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కల్లుకు వెసులుబాటు ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో కల్లు లేకపోవడంతో ఒక వర్గం ప్రజలు ఇబ్బంది

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కల్లుకు వెసులుబాటు ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో కల్లు లేకపోవడంతో ఒక వర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారికి కల్లే మంచి ఔషధం అన్నారు.