నేటి టీపీటీఎఫ్ ధర్నాను జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2020-10-28T10:23:01+05:30 IST
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి కోరారు.

వరంగల్ అర్బన్ ఎడ్యుకేషన్, అక్టోబరు 27: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి కోరారు. ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని హన్మకొండ కాళోజీ జంక్షన్‌లోని కాళోజీ విగ్రహం వద్ద మంగళవారం ఆయన ఆవిష్కరించారు. తిరుపతి మాట్లాడుతూ... ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయదర్శిని సంపాదకుడు బైరి స్వామి, నాయకులు శ్రీనివాసరావు, మనోజ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.