నేడు, రేపు మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-05-18T09:27:45+05:30 IST

నేడు, రేపు మోస్తరు వర్షాలు

నేడు, రేపు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను, తీవ్ర తుపానుగా మారిందని, ఇది మరింత తీవ్రంగా మారనుందని, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య 20న తీరాన్ని దాటే అవకాశముందని వివరించింది. 

Updated Date - 2020-05-18T09:27:45+05:30 IST