నేడు, రేపు తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2020-06-23T12:22:14+05:30 IST
నేడు, రేపు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాగల రెండు రోజులు (మంగళ, బుధవారాలు) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. కాగా, ఉత్తర ఇంటీరియర్, ఒడిసా పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.