నేడు, రేపు మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-06-22T09:29:36+05:30 IST

రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ..

నేడు, రేపు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర ఇంటీరియర్‌, ఒడిసా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-22T09:29:36+05:30 IST