నేడు, రేపు మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-06-16T10:14:44+05:30 IST

ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు, రేపు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. రాగల రెండు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

Updated Date - 2020-06-16T10:14:44+05:30 IST