నేడు ప్రైవేటు ఆసుపత్రుల దేశవ్యాప్త బంద్‌

ABN , First Publish Date - 2020-12-11T08:43:36+05:30 IST

ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సల అనుమతినిస్తూ సెంట్రల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా..

నేడు ప్రైవేటు ఆసుపత్రుల దేశవ్యాప్త బంద్‌

పంజాగుట్ట, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సల అనుమతినిస్తూ సెంట్రల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ), ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌(ఐడీఏ)లు శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకూ అత్యవసర, కొవిడ్‌ మినహా.. అన్ని రకాల వైద్య సేవలనూ నిలిపివేయనున్నారు.


గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వైద్య సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏ వైద్య విధానంలో చదువుకుంటే దానిలోనే ప్రాక్టీస్‌ చేయాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. 


Updated Date - 2020-12-11T08:43:36+05:30 IST