నేడు జవాన్‌ పరశురాం అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-12-27T07:42:24+05:30 IST

విధి నిర్వహణలో అమరుడైన ఆర్మీ జవాన్‌ పరశురాం అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా

నేడు జవాన్‌ పరశురాం అంత్యక్రియలు

దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శ

మహబూబ్‌నగర్‌/గండీడ్‌/శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 26: విధి నిర్వహణలో అమరుడైన ఆర్మీ జవాన్‌ పరశురాం అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తూ రెండ్రోజుల క్రితం అమరుడయ్యాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు శనివారం రెవెన్యూ అధికారులు తండాకు చేరుకొని ఏర్పాట్లపై బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.


ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం అమరుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆర్మీ జవాన్‌ మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రూ.25 లక్షలు ప్రకటించారని మంత్రి చెప్పారు.  కాగా పరశురాం పార్థివదేహం శనివారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. జవాన్‌ పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.


Updated Date - 2020-12-27T07:42:24+05:30 IST