మళ్లొచ్చే యేడు ఘనంగా కొలుస్తాం..నేడు సద్దుల బతుకమ్మ పర్వం

ABN , First Publish Date - 2020-10-24T11:26:53+05:30 IST

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సందడికి వేళ అయింది. శనివారం పం డుగ రోజున జరుపుకునేందుకు యావత్‌ మహిళాలో కం సిద్ధమైంది

మళ్లొచ్చే యేడు ఘనంగా కొలుస్తాం..నేడు సద్దుల బతుకమ్మ పర్వం

సాదాసీదాగా ముగియనున్న తొమ్మిది రోజుల పూలపండుగ


బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో సందడి చేసిన మహిళలు.. ప్రధాన ఘట్టమైన సద్దుల బతుకమ్మను నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. కరోనా ప్రభావంతో ఈసారి పండుగను ఘనంగా జరుపుకొనే అవకాశం కనిపించడం లేదు. గతంలో మాదిరిగా మహిళలు పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు, ఆటస్థలాలకు తరలివచ్చే సూచనలు లేదు. జీడబ్ల్యూఈఎంసీ, పురపాలక సంఘాలు కూడా బతుకమ్మ ఆటస్థలాల్లో ప్రత్యేక ఏర్పాట్లు అంతగా చేయడం లేదు.  


వరంగల్‌ కల్చరల్‌, అక్టోబరు 23: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సందడికి వేళ అయింది. శనివారం పం డుగ రోజున జరుపుకునేందుకు యావత్‌ మహిళాలో కం సిద్ధమైంది. పాటలు పాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా ఆటలు ఆడుకుంటారు. ప్రతీ ఇంటిలో రెండు బతుకమ్మలను పేర్చి తల్లి, పిల్ల బతుకమ్మలుగా భావిస్తారు. బతుకమ్మ పైభాగాన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. వీటిని పూజ గదిలో లేక ఒక మూలన అలికి ముగ్గు లు పెట్టి పీటలపై నిలుపుతారు. సాయం త్రం వేళ కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు ధరించి ఇంటి ముందు ఒకటి, రెండు చుట్లు ఆటలు ఆడిన తర్వాత సద్దుల బతుకమ్మతో బయలుదేరుతారు.  


కరోనా ప్రభావం

కరోనా నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు రావొద్దని, ఇళ్ల వద్దనే ఆడుకొని సమీప దేవాలయా ల్లో నిమజ్జనం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకొ ని ఏటా పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ సంబరాలు జరి గే వరంగల్‌లోని పోతన నగర్‌, భద్రకాళి ఆలయ ప్రాం తం, హన్మకొండలోని పద్మాక్షి ఆలయ పరిసరాల్లో వరంగల్‌ మహానగర పాలక సంస్థ పెద్దగా ఏర్పాట్లు చేయ డం లేదు. విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయడం మినహా పెద్దగా సౌకర్యాలు కల్పించడం లేదు. బతుకమ్మతో తరలివచ్చే మహిళలు భౌతిక దూరం పాటించాలని, ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లను వెంటతెచ్చుకోవాలని అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు కోరారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు పోలీసు యంత్రాంగం పక్షాన మాత్రం విస్తృత బందో బస్తు ఏర్పాట్లు చేస్తోంది. 


తీరొక్క పూలతో..

తొలిరోజు ఎంగిలి పువ్వులతో బతుకమ్మను తయారు చేయగా చివరిరోజు తీరొక్క పూలతో పెద్ద పరిమాణంలో సద్దుల బతుకమ్మను అలంకరిస్తారు. పైన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను ప్రతిష్ఠించి ఆటపాటలతో బతుకమ్మలకు నీరాజనాలు అందిస్తారు. తమ కష్టాలను దూరం చేసి సుఖశాంతులను ఇవ్వాలని కోరుతూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మల వేళ అతివల ఆహార్యం వయోభేదం లేకుండా వారు చేసే సందడి చూసి తీరాల్సిందే.


తంగేడుకు భలే గిరాకీ

హన్మకొండ, వరంగల్‌, కాజీపేట చౌరస్తాలు, అలాగే ప్రధాన రహదారులపై ఎక్కడ చూసినా శుక్రవారం సద్దుల బతుకమ్మ హడావిడి కనిపించింది. బతుకమ్మలను పేర్చడానికి ఉపయోగించే గునుగు, తంగేడు పూలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈసారి విస్తృతంగా కురిసిన వర్షాలతో గునుగు, తంగేడు చెట్లు దెబ్బతి పూలు అంతగా పూయలేదు. దీంతో ఈ రెండింటికి కరవు ఏర్పడింది. ఫలితంగా ధరలు ఆకాశన్నంటయి. పిడికెడు తంగేడు రూ.10 నుంచి రూ20కి విక్రయిస్తున్నారు. గునుగు పూవు చిన్న కట్టనే రూ.10కి విక్రయించారు. 

Updated Date - 2020-10-24T11:26:53+05:30 IST