పీఆర్‌సీని జనవరిలోనే ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-12-31T04:38:56+05:30 IST
పీఆర్‌సీని జనవరిలోనే ప్రకటించాలి

ఉద్యోగులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలి
టీఎన్‌జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాంకిషన్
వరంగల్‌రూరల్ కల్చరల్, డిసెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 63 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని జనవరిలోనేప్రకటించి వర్తింపజేయాలని టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కమిటీ ప్రతినిధులతో బుధవా రం చర్చించిన అనంతరం వరంగల్‌లో ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం కేసీఆర్ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, ఇతర విభాగాల సిబ్బందికి వేతనాలు పెంచడం హర్షదాయకమన్నారు. అయితే పీఆర్‌సీని జాప్యం చేయకుండా జనవరిలోనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రకటించిన ఖాళీలను కూడా ఇదే నెలలో భర్తీ చేయాలని కోరారు. ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. ప్రభుత్వంపైనే ప్రీమియం భారం వేయకుండా ఉద్యోగులు కూడా కొంత మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఆయన కోరారు.