టీఎన్జీవో, సొసైటీ నేతలను విచారించ లేదు: కారం రవీందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-22T21:09:43+05:30 IST

టీఎన్జీవో, సొసైటీ నేతలను విచారించ లేదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. హౌసింగ్‌ సొసైటీ అక్రమాలపై రంగారెడ్డి కలెక్టర్‌ ఇచ్చిన నివేదికపై రవీందర్‌రెడ్డి స్పందించారు.

టీఎన్జీవో, సొసైటీ నేతలను విచారించ లేదు: కారం రవీందర్‌రెడ్డి

హైదరాబాద్: టీఎన్జీవో, సొసైటీ నేతలను విచారించ లేదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. హౌసింగ్‌ సొసైటీ అక్రమాలపై రంగారెడ్డి కలెక్టర్‌ ఇచ్చిన నివేదికపై రవీందర్‌రెడ్డి స్పందించారు. కలెక్టర్‌ స్వయంగా విచారణ జరిపారని అనుకోవడం లేదన్నారు. 40ఏళ్లైనా ప్లాట్లు పొందినవారికి రిజిస్ట్రేషన్‌ చేయకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని చెప్పారు. తప్పు చేసినవారు శిక్షకు అర్హులేనని, భూమిని రీసర్వే చేయాలని కోరుతున్నామని చెప్పారు. వివరణ ఇవ్వాలని బాధ్యులైన రంగారెడ్డి ఎన్జీవోలను ఆదేశించామని పేర్కొన్నారు. టీఎన్జీవో వేరు.. హౌసింగ్‌ సొసైటీ వేరని చెప్పారు. రంగారెడ్డి జిల్లా హౌసింగ్‌ సొసైటీలో 998 మంది సభ్యులున్నారని, ప్లాట్లు రానివారు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని కారం రవీందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-06-22T21:09:43+05:30 IST