కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలంటూ టీజేఎస్ లేఖలు

ABN , First Publish Date - 2020-09-18T21:57:24+05:30 IST

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది.

కోదండరామ్‌కు మద్దతు ఇవ్వాలంటూ టీజేఎస్ లేఖలు

హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరాం‌కు మద్దతు ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది. త్వరలో నిర్వహించబోయే నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక విషయమై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ  పార్టీల కార్యాలయాలకు లేఖలు రాసింది. లేఖల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరామ్‌కు మద్దతునివ్వాలని టీజెఎస్ కోరింది. టీజేఎస్‌ను విద్యావంతులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల్లోని పట్టభద్రులు ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


అయితే టీఆర్‌ఎస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తిరిగి నిలబెట్టాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సూచించినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అన్ని పక్షాల మద్దతుతో పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. ఈ సారి కోదండరాం బరిలో ఉండడం వల్ల టీఆర్‌ఎస్‌కు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక వర్గాలు అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందువల్ల నిరుద్యోగులు, విద్యావంతులు, మేధావులు కోదండరాంను ఆధరిస్తారని టీజేఎస్ ఆశాభావంతో ఉంది.

Updated Date - 2020-09-18T21:57:24+05:30 IST