టీజేఎస్‌కు కామన్‌ సింబల్‌ తొలగింపు

ABN , First Publish Date - 2020-10-13T10:16:37+05:30 IST

టీజేఎస్‌కు కామన్‌ సింబల్‌ తొలగింపు

టీజేఎస్‌కు కామన్‌ సింబల్‌ తొలగింపు

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జన సమితి(టీజేఎ్‌స)కు కామన్‌ సింబల్‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. జనవరిలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ వినతి మేరకు మ్యాచ్‌ బాక్స్‌(అగ్గి పెట్టె) గుర్తును ఆ పార్టీ అభ్యర్థులకు కామన్‌ సింబల్‌ కింద ఎన్నికల సంఘం కేటాయించింది. కామన్‌ సింబల్‌ పొందిన  తదుపరి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం 10 శాతం స్థానాలకు పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ నిబంధనను పాటించనందున కామన్‌ సింబల్‌ను తొలగించారు. కామన్‌ సింబల్‌ను కోల్పోయిన వాటిలో బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌, జన శంఖారావం, యువ తెలంగాణ , సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌, ప్రజా సేన, మన తెలంగాణ రాష్ట్ర సమాఖ్య పార్టీలున్నాయి. 

Updated Date - 2020-10-13T10:16:37+05:30 IST