ఇప్పటివరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు : మంత్రి ఈటల

ABN , First Publish Date - 2020-03-19T00:24:27+05:30 IST

కరోనా నేపధ్యంలో తమ శాఖలోని ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇక... స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లుగా తేలిందని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని రాజేందర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు : మంత్రి ఈటల

హైదరాబాద్ : కరోనా నేపధ్యంలో తమ శాఖలోని ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇక... స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లుగా తేలిందని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చినవారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని రాజేందర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


కాగా శంషాబాద్ విమానాశ్రయంలో మరికొందరు అధికారులను నియమించినట్లుగా వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నామన్నారు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్ళి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే తెలంగాణలో ఒక్కరికి కూడా ఈ వ్యాధి సోవలేదని స్పష్టం చేశారు. విదేశాలనుంచి వచ్చే వారికి క్వారంటైన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


కరోనాను తేలికగా తీసుకోవద్దని ప్రజలకు మంత్రి ఈ సంద్భంగా విజ్ఞప్తి చేశారు. ‘గుంపులు గుంపులుగా తిరగొద్దు. అవసరమైతే తప్ప బయటకు రావద్దు’ అంటూ ప్రజలకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ఈ వ్యాధి పాజిటివ్ లక్షణాలున్నట్లుగా తెలిపారు. 

Updated Date - 2020-03-19T00:24:27+05:30 IST