కట్టడి ప్రాంతాల కుదింపు
ABN , First Publish Date - 2020-04-28T10:32:49+05:30 IST
లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండటం, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కట్టడి ప్రాంతాలను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తోంది. వైరస్ విస్తరిస్తోన్న

కేసులు తగ్గడంతో సర్కారు నిర్ణయం.. ప్రస్తుతం 159
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండటం, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కట్టడి ప్రాంతాలను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తోంది. వైరస్ విస్తరిస్తోన్న తొలి రోజుల్లో 243 కట్టడి ప్రాంతాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ఇప్పటికే పూర్తయింది. అనుమానిత లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్ చేయగా, కొందరికి పరీక్షలు సైతం నిర్వహించారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం దశల వారీగా కట్టడి ప్రాంతాలను ఎత్తివేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 17 నాటికి కట్టడి ప్రాంతాల సంఖ్య 209కి తగ్గించింది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో దశల వారీగా కట్టడి ప్రాంతాల సంఖ్యను 159కి కుదించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70, జిల్లాల్లో 89 కట్టడి ప్రాంతాలు ఉన్నాయి.