మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

ABN , First Publish Date - 2020-06-11T22:59:45+05:30 IST

మంచిర్యాల కొముర్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో పెద్ద పులల సంచారం కలకలం రేపుతోంది.

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

మంచిర్యాల కొముర్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లాలో రోజుకొక చోట పెద్దపులి కనిపిస్తోంది. బొగ్గుగనుల పరిసరాలలోనే ప్రస్తుతం పెద్ద పులి ఉంది. రోజుల వ్యవధిలో నాలుగుచోట్ల స్థానికులకు కనిపించింది. ఈ విషయాన్ని అటవీ అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసింది. అటు నుంచి తాండూరు, బెల్లంపల్లి పట్టణాల శివారులలో సంచరిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి ఓపెన్ కాస్ట్ కేకే ఫైవ్ గని వద్ద తిరిగిన పెద్ద పులి తాజాగా జిల్లాలోని శ్రీరాంపూర్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం సింగరేణి కార్మికులకు కనిపించింది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు.

Updated Date - 2020-06-11T22:59:45+05:30 IST